శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (19:18 IST)

కొత్తగూడెం జిల్లాలో దారుణం: శిశువు చెయ్యి విరిచిన వైద్యులు

Baby boy
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. శిశు కేంద్రంలో డాక్టర్లు కాన్పు చేస్తూ శిశువు చెయ్యి విరిచారు. శిశువు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాళ్లోకి వెళ్తే.. కాన్పు కోసం వచ్చిన భువన అనే మహిళకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
 
ఆపరేషన్ సమయంలో బిడ్డను బయటకు తీసే క్రమంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శిశువు చేయి విరిగింది. ఈ తతంగమంతా సోమవారం రాత్రి జరిగినప్పటికీ వైద్యులు బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
 
విరిగిన బిడ్డ చేతికి కట్టు కట్టి తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ బాధిత బంధువులు కోపోద్రిక్తులవుతున్నారు. శిశువు పరిస్థితి ఆందోళనగా ఉందన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.