శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2019 (05:14 IST)

చిల్లర రాజకీయాలతో పార్టీకి చెడ్డపేరు తేవొద్దు: తుమ్మల

వ్యక్తిగత కక్షలతో రాజకీయాలు చేయడం తగదని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న అరెంపలకు చెందిన తెరాస కార్యకర్తలను ఆయన పరామర్శించారు.

పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరుగుతుండగా పోలీసుల సూచన మేరకు అక్కడికి వెళ్లిన మాజీ సర్పంచ్​పై... రాజకీయ నేతల ప్రోద్భలంతో కేసులు పెట్టడం దారుణమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న అరెంపలకు చెందిన తెరాస కార్యకర్తలను ఆయన పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

చిల్లర రాజకీయాలు చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దని హెచ్చరించారు. వ్యక్తిగత కక్షలతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ఘర్షణలో గాయపడిన వారు జైలులో ఉంటే... కొట్టిన వాళ్లు బయట ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.