శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (14:39 IST)

పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలి-సత్తెనపల్లి తెదేపా నేతలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఆర్టీసీ బస్సుల చార్జీల పెంపును నిరసిస్తూ సత్తెనపల్లి పట్టణంలో బస్టాండ్ ముందు తెదేపా నేతలు ఫ్లకార్డులుతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెదేపా నేతలు మాట్లాడుతూ.. సామాన్య ప్రజలపై భారం మోపుతూ పెంచిన ఆర్.టి.సి చార్జీలను వెంటనే తగించాలి అని వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేస్తుంది.
 
ఎలక్షన్ ముందు స్వర్గం చూపిస్తాం అని చెప్పి ఇప్పుడు ప్రజలను నరకం లోకి నెడుతున్నారు, ప్రభుత్వ మొండి వైఖరి విడనాడి పేద ప్రజల పై భారం పడకుండా చేయాలని ప్రభుత్వ న్ని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
 
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఆళ్ల సాంబయ్య, సయ్యద్ పేద కరిముళ్ల, రాష్ట్ర అంగన్వాడీ అధ్యక్షురాలు భీమినేని వందనదేవి, పార్టీ ఆదక్షులు చౌట శ్రీను, నాలబోతు పాపారావు, సంగం డైరీ డైరెక్టర్ పోపురి కృష్ణ రావు, బత్తుల నాగేశ్వరవు, సర్వేపల్లి సీతయ్య, ముప్పాళ్ల వైస్ ఎంపీపీ రావిపాటి మధు, పోట్ల ఆంజనేయులు,

జిల్లా పార్టీ విద్యార్థి సెక్రెటరీ వి.అజయ్ కుమార్, టౌన్ పార్టీ సెక్రెటరీ SK. మస్తానవలి, మరెళ్ళ మల్లేశ్వర రావు, ఎస్కే అబ్దుల్లా, బత్తుల చంద్రశేఖర్, సురె నరేంద్ర, పచ్చ సుధీర్, మక్కపాటి రవిచంద్ర, గన్నామనేని శ్రీనివాసరావు, గుర్రం వెంకటేశ్వర్లు, ఆడుసుమల్లి వీరు, సర్వేపల్లి వెంకట రావు, జింకా లోకేశ్వరవు, దేవతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.