సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (13:16 IST)

రెచ్చిపోయిన విద్యార్థి.. హాస్టల్ రూమ్‌లో గొంతు కోశాడు

knife
హైదరాబాదులో ఓ విద్యార్థి రెచ్చిపోయాడు. ఓ విద్యార్థి  తోటి విద్యార్థి గొంతుకోశారు. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలోని గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్ రూమ్‌లో ఓ విద్యార్థి తోటి విద్యార్థి గొంతుకోశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
గాయపడిన విద్యార్థిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. విద్యార్థికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.