గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (07:43 IST)

కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుపోయి చిన్నారి మృతి.. ఎక్కడ?

కొబ్బరి ముక్క ఓ చిన్నారిని బలితీసుకున్న ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మూడున్నరేళ్ల చిన్నారి గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుంది.

అంతే ఆ చిన్నారి బాధను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరువల్లూరులో జరిగింది. మృతి చెందిన ఆ చిన్నారిని వసంత్ అనే వ్యక్తి కొడుకు సంజీశ్వరన్ గా గుర్తించారు.
 
కుటుంబ సభ్యులు వంట పనుల్లో బిజీగా ఉండగా చిన్నారి కొబ్బరి ముక్క తింటున్నాడు. ఒక్కసారిగా గొంతులో అడ్డుపడటంతో ఏడవడం మొదలుపెట్టాడు. 
 
ఆ గందరగోళంలోనే గొంతులో కొబ్బరి ముక్కఇరుక్కున్నట్లు గుర్తించారు. బాగా ఏడుస్తూ వుండిన బాబు ఒక్కసారిగా ఏడుపు ఆపేశాడు. వెంటనే తిరువల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లేసరికి ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.