సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:18 IST)

చేపల కోసం చెరువులో వలేసిన జాలర్లు.. ఏం పడిందో చూసి షాక్

చేపల కోసం చెరువులో వలేసిన జాలర్లు అదిరిపడ్డారు. చేపల వలలో 100 కేజీలకు పైగా బరువున్న భారీమొసలి చిక్కుకోవడంతో అందరూ షాకయ్యారు. దాన్ని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.
 
చేపల వేట కోసం చెరువులోకి దిగిన ఆ మత్స్యకారులకు ఊహించని షాక్ తగిలింది. ఊర చెరువులో చేపల కోసం వేసిన వలలో భారీ మొసలి చిక్కడంతో గుండె ఆగినంత పనైంది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బొమ్మాయికుంటలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన మత్స్యకారులు పెసరి శివ, స్వామి, రాములు రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి కూడా చేపలు పట్టడం కోసం ఊర చెరువులో వలలు ఏర్పాటు చేశార

బుధవారం వలలో పడిన చేపలను బయటికి తీసేందుకు రాగా భారీ మొసలి చిక్కుకుని కనిపించింది. సుమారు 100 కిలోలకు పైగా బరువున్న మొసలిని బంధించేందుకు రెండు గంటల పాటు శ్రమించి బంధించారు.

అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు దాన్ని స్వాధీనం చేసుకుని పాకాల సరస్సులో విడిచిపెట్టారు.