శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (10:04 IST)

చేప ఆకారంలో శిశువు జననం.. రెండు గంటల్లోనే..

హైదరాబాద్పే, ట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో చేప ఆకారంలో ఓ శిశువు జన్మించింది. సంగారెడ్డికి చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌, తహెసీన్‌ సుల్తానా (20)భార్యాభర్తలు. తహెసీన్‌ సుల్తానాకు 9 నెలలు నిండడంతో ఈ నెల 5వ తేదీన పేట్లబురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది.

బుధవారం సాయంత్రం 7 గంటలకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో వైద్యులు ఆపరేషన్‌ చేయగా రెండు కాళ్లు అతుక్కుని ఉన్న ఆకారంలో (చేప) జన్మించింది. వైద్యులు ప్రత్యేక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ శిశువు రెండు గంటల్లోనే మృతి చెందింది.

ఈ విషయంపై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరగా.. తహెసీన్‌ సుల్తానా గర్భసంచిలో ఉమ్మునీరు తక్కువగా, ఆమె బలహీనంగా ఉండడం వల్లనే ఇలాంటి శిశువులు జన్మిస్తారని చెప్పారు.