శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:33 IST)

లోటస్‌పాండ్‌ కు ఆగని అభిమానులు

లోటస్‌పాండ్‌లోని వైఎస్ షర్మిల ఇంటి దగ్గర రెండో రోజు అభిమానులు సందడి చేశారు. పలు జిల్లాల నుంచి షర్మిలను కలిసేందుకు అభిమానులు వస్తున్నారు. ఇవాళ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్ పుట్టిన రోజు కావడంతో అభిమానుల కోలాహలం నెలకొంది.
 
తెలంగాణలో షర్మిల పార్టీపై మంత్రి బాలిలేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ తమ నాయకుడని... జగన్ ఆలోచన ప్రకారం తాము పని చేస్తున్నామని తెలిపారు.

షర్మిల ఆంధ్రాలో పార్టీ పెట్టలేదని... తెలంగాణలో పెట్టాలని ఆలోచిస్తున్నారని చెప్పారు. తెలంగాణతో సఖ్యత కోసం వైసీపీని అక్కడ పెట్టలేదని స్పష్టం చేశారు. పార్టీలు పెట్టే విషయంలో ఎవరి ఇష్టం వారిదని మంత్రి బాలినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.