శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:21 IST)

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అరుదైన గుర్తింపు

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ మండలి నుంచి 'వాయిస్‌ ఆఫ్‌ కస్టమర్‌' గుర్తింపు లభించింది.

2020లో ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందించినందుకుగాను ఈ గుర్తింపు దక్కిందని ఎయిర్‌పోర్టు వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.

కోవిడ్‌-19 పరిస్థితుల్లో కాంటాక్ట్‌లెస్‌ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు దేశంలోనే ఈ-బోర్డింగ్‌ సదుపాయం కలి్పంచిన తొలి విమానాశ్రయంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఘనత సాధించింది.

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడం అభినందనీయమని జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు(గెయిల్‌) సీఈఓ ప్రదీప్‌ ఫణీకర్‌ పేర్కొన్నారు.