సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (13:41 IST)

రూపాయికే నాలుగు సిలిండర్లు.. కుమ్మరి వెంకటేశ్ యాదవ్

LPG Cylinder
తెలంగాణ ఎన్నిక‌ల్లో తాము గెలిస్తే రూ.400లకే గ్యాస్ సిలిండ‌ర్ ఇస్తామ‌ని బీఆర్ఎస్ ప్ర‌కటించింది. కాంగ్రెస్ రూ.500కి సిలిండ‌ర్ ఇస్తామంటోంది. అంత‌కుమించి కుమ్మ‌రి వెంక‌టేశ్ యాద‌వ్ ఏకంగా రూపాయికే నాలుగు సిలిండ‌ర్ల‌ు ఇస్తామని ప్ర‌క‌టించారు. దీంతో జనం షాకయ్యారు. 
 
ఇదొక్కటే కాదు.. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలిస్తానని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌న‌ను గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రతి వంద కుటుంబాలకు ఒక వాలంటీరును నియమించి సేవ‌లందిస్తాన‌ని చెప్పుకొచ్చారు.