1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (13:13 IST)

హైదరాబాద్‌కు మోదీ.. ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన

Modi
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఎంఆర్పీఎస్ తలపెట్టిన మాదిగల విశ్వరూప మహా సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మోదీ పర్యటన సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 
 
వాహనదారులు ఇబ్బందులు పడకుండా ప్రత్యమ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన బీజేపీ నాయకత్వం మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. 
 
శనివారం సికింద్రాబాద్‌లో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో 'అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ'కు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ వేదికపై నుంచే ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాన్ని మోదీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.