గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 జులై 2022 (12:16 IST)

చిక్కడపల్లిలో గన్​ఫైర్ ​: వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో గన్​ఫైర్​ జరిగింది. ఓ వ్యక్తి తన లైసెన్స్​డ్​ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడిని కడపకు చెందిన న్యాయవాది శివారెడ్డిగా గుర్తించారు.
 
లైసెన్స్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.