1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (18:48 IST)

హుజూరాబాద్ నియోజకవర్గంలో గవర్నర్.. డోలు కొట్టి సభను..?

బీజేపీ సీనియర్ నేత.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. జమ్మికుంటలో నిర్వహించిన గొల్లకురుమల ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చదువుకుంటే ఉన్నత స్థానాలకు వస్తారని అన్నారు.
 
హుజూరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితికి అనుగుణంగా ఆయా రాజకీయ పార్టీలు వ్యుహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏదో ఒక పేరుతో హుజూరాబాద్ నియోజకవర్గంలో వాలిపోతున్నారు. అధికార పార్టీ నుండి  మొదలు ప్రత్యర్థి పార్టీలు తమ అవకాశాన్ని వదులు కోవడం లేదు.
 
ఈ క్రమంలోనే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన గొల్లకుర్మలు జమ్మికుంటలో గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సంధర్బంలోనే సభకు పెద్ద ఎత్తున గొల్ల కుర్మలు సభకు హజరు కావడంతో గవర్నర్ దత్తాత్రేయ డోలు కొట్టి సభను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ... మీ కుటుంబ సభ్యునిగా ఆదరించి ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు మీ అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలని అన్నారు.