శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (14:57 IST)

దాడి కేసులో డుమ్మాకొట్టిన అసదుద్దీన్... నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీపై జరిగిన దాడి కేసులో అసదుద్దీన్ నిందితుడుగా ఉన్నారు. ఈ కేసు విచారణకు ఆయన హాజరుకాలేదు. దీంతో ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 
 
2015లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ… ప్రయాణిస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. అందులో కొంతమంది కారు లోపల కూర్చున్న షబ్బీర్ అలీపై దాడి చేశారు. 
 
మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో అసదుద్దీన్ ఒవైసీని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న పోలీసులు.. క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే, ఈ దాడిలో తన పాత్ర లేదని గతంలో ఒక ట్వీట్‌ ద్వారా అసదుద్దీన్ వెల్లడించారు. తాను దాడి చేసినవారిని అడ్డుకున్నానని అందులో పేర్కొన్నారు.