మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

తెలంగాణాలో శాంతించిన కరోనా... దేశంలో పెరిగిన పాజిటివ్ కేసులు

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా మేరకు శాంతించింది. రోజువారీ కొత్త కేసులు 200 నుంచి 500 లోపే నమోదవుతున్నాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం 29,560 కరోనా టెస్టులు నిర్వహించగా, 197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,253కి చేరింది. ఇందులో 2,88,275 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3389 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1589కి చేరింది.  
 
మరోవైపు, దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఇండియాలో కొత్తగా 14,849 కరోనా కేసులు 155 కరోనా మరణాలు నమోదయ్యాయి. 
 
దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,06,54,533కి చేరగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,53,339కి చేరింది. 1,03,16,786 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,84,408 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 15,948 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.