శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (11:06 IST)

క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గతంలో 10 వేలకు దిగువున నమోదైన ఈ కేసులు ఇపుడు 14 వేల వరకు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 14,256 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో మహమ్మారి కారణంగా 152 మంది ప్రాణాలు కోల్పోయారు. 17,130 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
 
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,06,39,684కి చేరుకుంది. మొత్తం 1,53,184 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,03,00,838 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
ప్రస్తుతం దేశంలో 1,85,662 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 13,90,592 మందికి వ్యాక్సిన్ వేశారు. అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
 
ఇకపోతే, తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 221 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 431 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,93,056కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,87,899 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,588కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 3,569 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1973 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 36 కరోనా కేసులు నమోదయ్యాయి.