మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (19:44 IST)

లంగర్‌‍హౌజ్‌లో దారుణం - ప్రియుడిని కత్తితో పొడిచిన ప్రేయసి

హైదరాబాద్ నగరంలోని లంగర్‌హౌజ్‌లో దారుణం జరిగింది. తనను మోసం చేసిన ప్రియుడిపై ఓ ప్రియురాలి కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, లంగర్‌హౌజ్ ప్రాంతానికి చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలోపడింది. అయితే, గత కొన్ని నెలలుగా వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ప్రియుడు తన ప్రియురాలికి దూరంగా ఉండసాగాడు. 
 
దీన్ని జీర్ణించుకోలేని ప్రియురాలు కత్తితో ప్రియుడిపై దాడి చేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమై ఉస్మానియా ఆస్పత్రికి తరలించడంతో యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అదుపులోకి తీసుకున్నారు.