బయటకెళ్లిన భర్త.. ప్రియుడిని ఇంటికి పిలిచి అడ్డంగా బుక్కైన భార్య
కరోనా వైరస్ ఎపుడైతే తీవ్రరూపం దాల్చిందే అపుడే ప్రేమికులకు, చాటుమాటుగా, గుట్టుచప్పుడుకాకుండా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చిన వారికి కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా, అలాంటి వారిని ఈ లాక్‌డౌన్ ఒక్కటి కానివ్వకుండా చేస్తోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లో ఓ వివాహిత అడ్డంగా బుక్కైంది. ఓ గంటపాటు భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లగానే తన ప్రియుడుని ఇంటికి పిలిపించుకుంది. ఈ విషయాన్ని గమనించిన ఇరుగు పొరుగువారం ఆమె భర్తకు ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. అంతే.. భర్త ఇంటికి తిరిగి రావడంతో ప్రియుడుతో కామదాహం తీర్చుకుంటూ భార్య అడ్డంగా బుక్కైంది.
ఇది సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, అడ్డగుట్ట ప్రాంతంలో తన భర్తతో కలిసి ఓ మహిళ నివసిస్తోంది. ఈమెకు స్థానికంగా ఉండే ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దిర మధ్య వివాహేతర సంబంధానిక దారితీసింది. ఈ విషయం స్థానికుల్లో చాలా మందికి తెలిసింది. కానీ భర్తకు మాత్రం తెలియలేదు. దీంతో వారి వివాహేతర సంబంధం కొంతకాలంగా సాగుతూ వస్తోంది.
ఈ క్రమంలో ఈ జంట వివాహేతర బంధానికి లాక్‌డౌన్ అడ్డుగోడ కట్టేసింది.. ఆమె భర్త.. లాక్‌డౌన్‌తో ఇంటికి పరిమితం కావడంతో.. ప్రియుడి ఎడబాటును ఆమె తట్టుకోలేకపోయింది. కానీ, గత రాత్రి ఆమె భర్త గంటసేపు పని మీద బయటకు వెళ్లగా.. వెంటనే ఫోన్ చేసి ప్రియుడిని ఇంటికి పిలుపించుకున్న ఆ మహిళ.. శృంగారంలో మునిగితేలారు.
అయితే, ఇది గమనించిన బంధువులు వెంటనే భర్తకు సమాచారం ఇవ్వడంతో రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మొత్తానికి లాక్‌డౌన్‌లో వాళ్లను దూరం చేయడమే కాదు.. లాక్‌డౌనే వాళ్లిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా చిక్కెలా చేసింది.