శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (09:59 IST)

ఏటీఎం కేంద్రానికి పరుగులు తీసిన పాతబస్తీ వాసులు.. ఎందుకు?

hdfcbank
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ ఏటీఎం కేంద్రం వద్దకు హైదరాబాద్ వాసులు పరుగులు తీశారు. పాతబస్తీలోని ఓ ఏటీఎం కేంద్రంలో రూ.500 డ్రా చేస్తే రూ.2500 వచ్చాయి. ఈ విషయం క్షణాల్లో ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికులు తమ తమ ఏటీఎం కార్డులతో ఈ కేంద్రానికి పరుగులు పెట్టి డబ్బులు డ్రా చేసేందుకు పోటీపడ్డారు. 
 
శాలిబండకు చెందిన ఓ వ్యక్తి గత రాత్రి హరిబౌలి చౌరస్తాలోని హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఏటీఎం కేంద్రంలో రూ.500 డ్రా చేశాడు. అయితే, ఆయనకు రూ.500 స్థానంలో రూ.2500 వచ్చాయి. దీంతో అతను పోలీసులకు సమాచారం చేరవేశాడు. అయితే, ఈ విషయం అప్పటికే స్థానికంగా తెలిసిపోయింది. దీంతో అనేక మంది స్థానికులు డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం కేంద్రానికి క్యూకట్టారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఏటీఎం కేంద్రాన్ని మూసివేసి, బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు.