Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి పెళ్లి చెడగొట్టాలనీ... వరుడుని కిడ్నాప్ చేసిన లవర్... ఎక్కడ?

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (09:11 IST)
ఆ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. కానీ, ఇంట్లోని పెద్దల ఒత్తిడి కారణంగా తన ప్రియురాలికి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు.. ఈ పెళ్లిని చెడగొట్టాలని భావించాడు. అంతే.. తన ప్రియురాలిని వివాహమాడనున్న వరుడుని కిడ్నాప్ చేశాడు. కేవలం ఈ పెళ్లి చెడగొట్టాలన్న ఏకైక ఉద్దేశ్యంతోనే ఈ పనికిపాల్పడ్డాడు. 
 
ఈ ఘటన హైదరాబాద్‌లోని మైలార్ దేవుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, మైలార్దేవుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కింగ్స్ కాలనీకు చెందిన నదీమ్ ఖాన్‌(28)కు ఇటీవల ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ అమ్మాయిని ఓ యువకుడు ప్రేమించాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న అతడు పెళ్లిని చెడగొట్టాలని భావించాడు. ఈ క్రమంలో ఆమెకు కాబోయే భర్త నదీమ్ ఖాన్‌ శనివారం బైక్‌పై వెళ్తుండగా ఆపి కిడ్నాప్‌ చేశాడు. ఆ ప్రేమికుడు కిడ్నాప్‌ చేయడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీశారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్‌ అతడితో కుమార్తె ప్రేమాయణం తెలిసే కుటుంబసభ్యులు నదీమ్‌ఖాన్‌తో నిశ్చితార్థం జరిపినట్టు తేలింది. 
 
ఇది తట్టుకోలేకనే ఆ యువకుడు నదీమ్‌ను కిడ్నాప్ చేసినట్టు వెల్లడైంది. అయితే ఈ కిడ్నాప్‌ ఘటనలో అమ్మాయికి ముందుగానే సమాచారం ఉందా లేదా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మైలార్ దేవుపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. 

అన్నీ చూడండి

నెమ్మదించిన కెరీర్ - పెళ్లి పీటలెక్కనున్న బుట్టబొమ్మ

గ్లామర్ అంటే జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా? బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్న

తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

తర్వాతి కథనం
Show comments