గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 మే 2023 (15:06 IST)

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు... ఒక్క హైదరాబాద్‌లోనే 40 చోట్ల

income tax
తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 40 చోట్ల ఈ సోదాలు సాగుతున్నాయి. ముఖ్యంగా, కళామందిర్ షాపులు, డైరెక్టర్ల గృహాల్లో ఈ సోదాలు చేస్తున్నట్టు సమాచారం. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
మంగళవారం ఉదయం ఆరు గంటలకే కళామందిర్ డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్ నివాసాలకు చేరుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు.. వారి ఇళ్లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే, ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణంలలో ఉన్న కళామందిరి షాపుల్లో ఈ తనికీలు నిర్వహిస్తున్నారు.