శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 మే 2023 (09:47 IST)

హైదరాబాద్‌కు వస్తున్న ప్రియాంకా గాంధీ.. ఎందుకో తెలుసా?

priyanka gandhi
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా నేత ప్రియాంకా గాంధీ హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఈ నెల 8వ తేదీన జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పీసీసీ నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన సభలో ఆమె పాల్గొంటారని పార్టీ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. 
 
నిజానికి ఈ నెల 5 లేదా 6వ తేదీనే సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారని ఇదివరకే ప్రకటించారు. కానీ, సభ 8వ తేదీకి వాయిదా పడినట్లు తెలిసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈనెల 8వ తేదీతో ముగియనుంది. అక్కడి నుంచి దిల్లీకి తిరిగివెళుతూ ఆమె హైదరాబాద్‌కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.