Dharma Sangrah
✕

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేపై రూ.1000 కోట్ల పరువు నష్టం దావా

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 30 మే 2023 (08:55 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై రూ.1000 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) టోల్‌ వసూలు లీజ్‌కు సంబంధించి ఐఆర్‌బీ సంస్థ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు ఈ పరువు నష్టం దావా నోటీసులను పంపించింది. 
 
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌(ఓఆర్‌ఆర్‌) రోడ్డుపై తిరిగే వాహనాల నుంచి టోల్‌ వసూలు కాంట్రాక్ట్‌ టెండర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఐఆర్‌బీ డెవలపర్స్‌ సంస్థకు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్‌ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పలు ఆరోపణలు చేశారు. ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
 
ఓఆర్‌ఆర్‌ టోలింగ్‌, నిర్వహణ, మరమ్మతు కార్యకలాపాలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్‌లో ఐఆర్‌బీ సంస్థ టెండర్‌ను దక్కించుకుంది. 158 కిలోమీటర్ల రహదారి టోలింగ్‌, నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏకు రూ.7,380 కోట్లు ముందస్తుగా చెల్లించింది. ఈ ఒప్పందం 30 ఏళ్ల పాటు అమల్లో ఉండనుంది. ఈ ఒప్పందంలో అవకతవకలు, అవినీతి జరిగిదంటూ రఘునందన్ రావు ఆరోపణలు చేయడంతో ఆగ్రహించిన ఐఆర్‌బీ సంస్థ ఈ నోటీసులను పంపించింది.  

అన్నీ చూడండి

ఆ ఛాన్స్ దైవిక నిర్ణయం - అసలైన స్థాయి ఏంటో అపుడు తెలిసింది : రేణూదేశాయ్ (Video)

స్వామీజీని వివాహమాడిన వరుణ్ తేజ్ హీరోయిన్

అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రాజిగాడు రాజయ్యాడు సిద్ధం

AR Rehman: ప్రభుదేవా, ఏ.ఆర్. రెహమాన్‌ నటించిన మూన్ వాక్ క్రిస్మస్ విడుదలకు సిద్ధం

ది సెస్సో ట్రైలర్ ఆకట్టుకుంది సినిమా కూడా వుంటుంది :ఆకాష్ జగన్నాథ్

తర్వాతి కథనం
Show comments