సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 మే 2023 (12:53 IST)

మండే ఎండల్లో ప్రజలకు శుభవార్త - ఐదు రోజుల పాటు వర్షాలే వర్షాలు

Rain in Tirumala
తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వానలు కొనసాగుతున్నాయి. రోహిణి కార్తెలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో కాస్త ఉపశమనం పొందుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూచ్ చెప్పింది. తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
తెలంగాణాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది.