గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (13:07 IST)

తెలంగాణాలో 7 నుంచి 14 ఎంపీ స్థానాల్లో పోటీ చేద్దాం : పవన్ కళ్యాణ్

pawan kalyan
తెలంగాణ రాష్ట్రంలో కనీసం 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లోను, 25 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేద్దామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన జనసేన పార్టీ నేతలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నేల పెట్టిన తిండి తిన్నాను. అది ఎక్కడికి పోతుంది. రక్తంలో ఇంకిపోయింది. నాదొక్కటే కోరిక. కనీసం పది మంది అయినా తెలంగాణ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యేలు ఉండాలి అని ఆకాంక్షను వ్యక్తం చేశారు. 
 
ఏదైనా సమస్యపై గొంతెత్తిన తర్వాత కూడా పరిష్కారం రాకపోతే వీధి పోరాటలకు సిద్ధఁకావాలని, అలాంటి వీధి పోరాటలుక తాను సిద్ధమని అన్నారు. ఎందుకు వచ్చారని తెలంగాణ ప్రజానీకం అడిగితే.. మేమం మీ భుజం కాయడానికి వచ్చామని చెప్పాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. 
 
అయితే, వచ్చే అసెంబ్లీ, ఆ తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణాలో పరిమిత స్థానంలోనే పోటీ చేస్తామని వెల్లడించారు. కనీసం 7 నుంచి 14 ఎంపీ స్థానాల్లో పోటీ చేసినా బలంగా పోటీ చేద్దామని చెప్పారు. మీరంతా కలిసి ఫలనా చోట పోటీ చేద్దామని కోరితే అక్కడే పోటీ చేద్దామని చెప్పారు. అదేసమయంలో తెలంగాణాలో మనతో ఎవరైనా పొత్తుకు వస్తే వారితో జనసేన పొత్తు పెట్టుకుంటుందని చెప్పారు.
 
ఒక చిన్న ఉద్యోగానికి ఎన్నో పరీక్షలు నిర్వహిస్తారని, నాయకత్వం వహించాలంటే ఇంకెన్ని పరీక్షలు ఎదుర్కోవాలి అని ప్రశ్నించారు. కాలం పెట్టే పరీక్షలు ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. చాలా విషయాల్లో తాను తగ్గి మాట్లాడుతున్నానని, భయపడి మాత్రం కాదని చెప్పారు. తెలంగాణాలో పరిమితులతో కూడిన ఆట ఆడుతున్నానని చెప్పారు.