శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (10:33 IST)

జనగామ జిల్లా కలెక్టర్‌ వాహనానికి 23 చలాన్లు

Jangaon
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధికారులే నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. జనగామ జిల్లా కలెక్టర్‌ వాహనానికి 23 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఆగస్టు 30 వరకు 23 చలాన్లు నమోదయ్యాయి. 
 
కలెక్టర్ 22వేల 905 చెల్లించాల్సి ఉన్నట్లుగా తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇ-చలాన్‌ సిస్టం' వెబ్‌సైట్‌లో తేలింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.