బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 25 మార్చి 2020 (23:24 IST)

తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కవిత...

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యేక  వీడియో సందేశం విడుదల చేశారు. శార్వరి నామ సంవత్సరం అందరి కుటుంబాల్లో సుఖసంతోషాలు నింపాలని కోరారు కల్వకుంట్ల కవిత. ఇది కరోనా వైరస్ పరీక్షా సమయమన్న కవిత, ఈ సమయంలో నాకేం అవుతుందిలే అనే నిర్లక్ష్యానికి పోకుండా, ప్రభుత్వ సూచనలు పాటిస్తూ స్వీయ నియంత్రణతో మనందరం ఇండ్లలో ఉండటమే శ్రేయస్కరం అని అన్నారు.
 
ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నా, అది మనల్ని కాపాడటానికే అనే విషయాన్ని గమనించాలని కవిత కోరారు. ఈ సమయంలో కుటుంబాలను వదిలేసి ప్రజలకు సేవ చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసు శాఖ వారికి, ఇతర శాఖల వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తి చాటుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కరోనా నుండి కాపాడటం కోసం మనందరం ప్రభుత్వం తో కలిసి నడవాలి అని కోరారు.