శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (08:56 IST)

కెసిఆర్ రాజకీయ ఉగ్రవాది, దళిత ద్రోహి... తెలంగాణ కాంగ్రెస్ నేతలు

కేసీఆర్ దళిత ద్రోహి అని, రాజకీయ ఉగ్రవాది అని తెలంగాణ కు చెందిన కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు తదితరులు ధ్వజమెత్తారు. తెలంగాణ లో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిపిన నేతలు మాట్లాడుతూ...
 
"అన్యాయాన్ని ఎదుర్కునే తెలంగాణ గడ్డను ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ పిదప అణచివేయబడుతున్న గడ్డగా మార్చిన చరిత్ర కెసిఆర్ దే. తెలంగాణ లో పాలకులు అంబేత్కర్ విగ్రహాలను చూసి భయపడుతున్నారు. విగ్రహాలను కూల్చారు, విగ్రహాలను ఎత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో పెట్టారు. 
 
ఇది విగ్రహాలకు సంబంధించిన అంశం కాదు. రాజ్యాంగాన్ని రచించి  బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన ఒక మహనీయుని అవమానించడం ఏమిటి. 
 
ఇది అణచివేత కు పరాకాష్ట కాదా ? పాలన రాజ్యాంగబద్దంగా జరగాలి, చట్ట సభలు చట్టలను చేసి వాటిని ప్రజల కోసం అమలు చేయాలి. ఇవన్నీ ఎలా ఉండాలో నేర్పించిన మహనీయులు అంబేత్కర్ ఆయనను అవమణిస్తే ఈ దేశంలోని కోట్లాది ప్రజలను అవమానించినట్టే.. 
 
ఢిల్లీ లో జరుగుతున్న ఈ ఉద్యమం దేశ వ్యాప్తం కావాలి. మరోసారి హక్కుల కోసం పోరాటం ఉదృతం చేయాలి. తెలంగాణ ఒక అణచివేత కేంద్రంగా మారింది. కనీస హక్కులు కూడా అమలు కావడం లేదు. నియంతలా రాజరిక పాలన చేస్తున్నారు. ఇది సహించరానిది. దీనిని అడ్డుకోవాలి, ఎదిరించాలి. ప్రజలు అంటే ఏంటో చూపాలి" అని పిలుపునిచ్చారు.