బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 28 జులై 2018 (19:14 IST)

చంద్రగ్రహణం రోజున పంది కడుపున మనిషిని పోలిన జీవి... బ్రహ్మంగారు చెప్పిందా?

చంద్రగ్రహణం అనగానే ఎన్నో విశ్వాసాలుంటాయన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ విశ్వాసాలను కొందరు వాడేసుకుంటుంటారు. ఏపీలో మూఢనమ్మకంతో నర బలి ఇచ్చేందుకు ప్రయత్నించిన ఏడుగురి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుంటే తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో చంద్రగ్రహణం ఫ

చంద్రగ్రహణం అనగానే ఎన్నో విశ్వాసాలుంటాయన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ విశ్వాసాలను కొందరు వాడేసుకుంటుంటారు. ఏపీలో మూఢనమ్మకంతో నర బలి ఇచ్చేందుకు ప్రయత్నించిన ఏడుగురి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుంటే తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో చంద్రగ్రహణం ఫలితంగా పంది కడుపున మనిషిని పోలిని జీవి పుట్టిందంటూ ప్రచారం జరుగుతోంది. 
 
ఆ ఫోటోలను షేర్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. ఐతే వాస్తవానికి ఆ ఫోటోలు కనబడుతున్న పందిలాంటి జీవి కెన్యాలో పుట్టినట్లు ప్రచారంలో వుంది. ఐతే అక్కడ పుట్టింది కూడా జీవేనా లేక ఏదైనా బొమ్మనా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే... వీడియోలో షేర్ చేసినదాన్ని చూస్తుంటే ఆ జీవి అచ్చం బొమ్మలా అటుఇటూ కదులుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. 
 
కాబట్టి ఇదంతా అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. చంద్రగ్రహణం రావడంతో ఇలాంటి ఫోటోలను పెట్టి కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.