Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ఆషామాషీగా చెప్పలేదు : ఈటల రాజేందర్

Written By వరుణ్
Updated: సోమవారం, 16 అక్టోబరు 2023 (13:50 IST)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తాను పోటీ చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఆషామాషీగా చేయలేదని మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, జమ్మికుంటలో కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ బహిరంగ సభ జరుగనుంది. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను ఈటల సోమవారం పరిశీలించారు.
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌ చేసిన సవాల్‌పై ఆయన స్పందించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు రూ.100 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి దౌర్జన్యం చేసినా.. అధికార యంత్రాంగం మొత్తాన్ని తనపై కేంద్రీకరించినా గెలిచానని వివరించారు. ఆ ఉపఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ను ఓడించటమే తన లక్ష్యమన్నారు. ఆ మేరకే గజ్వేల్‌ నుంచి పోటీ చేయనున్నట్టు ఈటల స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను తాను అంత ఆషామాషీగా చేయలేదని స్పష్టం చేశారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments