ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (09:19 IST)

అవసరానికి డబ్బులు ఇచ్చిన పాపానికి.. ప్రాణాలే పోయాయి

అవసరానికి డబ్బులు ఇచ్చిన పాపానికి... అప్పిచ్చిన వ్యక్తే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ 13 రోజులుగా ఇంటిముందు బైఠాయించిన వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలంలో మెట్‌పల్లికి చెందిన ఒగ్గు కళాకారుడు వీరెల్లి సంపత్‌.... గతంలో సతీశ్‌ అనే వ్యక్తికి 32లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఎంతో బ్రతిమిలాడటంతో తీసుకున్న డబ్బుల్లో కొంత అప్పుడప్పుడు తిరిగ్గి ఇచ్చిన సతీశ్‌, ఇంకా 7లక్షల రూపాయలు సంపత్‌కు ఇవ్వాల్సి ఉంది. డబ్బులివ్వాలని అప్పటికే ఎంతో వేడుకున్న సంపత్‌, చేసేదిలేక డబ్బులు తీసుకున్న సతీశ్‌ ఇంటి ముందు 2 వారాల క్రితం ఆందోళనకు దిగాడు. దీంతో సతీశ్‌ ఇంటికి తాళం వేసుకుని, పరారయ్యాడు.
 
అప్పటికే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంపత్‌, 13రోజులుగా అక్కడే బైఠాయించటంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.