సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2023 (17:18 IST)

వచ్చే ఎన్నికల్లో భారాసను గద్దె దించడమే తమ లక్ష్యం : ప్రొ.కోదండరామ్

kodandaram
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితి (భారాస)ను ఇంటికి పంపించడమే తమ లక్ష్యమని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టంచేశారు. ఆయన వచ్చే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, భారాసపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీతో చర్చించినట్టు తెలిపారు. సీట్ల సర్దుబాటు అంశంపై మరోమారు సమావేశమవుతామని చెప్పారు. అలాగే, రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతామని ఆ తర్వాత సీట్ల పంపిణీపై పూర్తి క్లారిటీ వస్తుందని తెలిపారు. తమ అందరి లక్ష్యం సీఎం కేసీఆర్‌ను ఓడించడమేనని చెప్పారు.