ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (22:08 IST)

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి: కటౌట్లకు పాలాభిషేకం

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. గాంధీభవన్‌లో జరిగిన సభలో ఓ కార్యకర్తకు గాయం అయ్యింది. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిన దీపం వేదిక పైనుంచి జారి పడటం వల్ల కిందనున్న కార్యకర్త తలకు గాయమైంది. వెంటనే అక్కడున్న సేవాదళ్ కార్యకర్తలు, పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.
 
ఇకపోతే.. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం టీపీసీసీ చీఫ్‌గా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన ప్రమాణం స్వీకరించారు. దీంతో చిత్తూరులో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తపోవనం వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.