ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (17:30 IST)

ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలే పార్టీ మారారు.. ఇక నేనెంత?: రేవంత్ రెడ్డి Vs మాగంటి గోపీనాథ్

తెలంగాణ అసెంబ్లీ రాబీల్లో తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి, టీడీపీ నుంచి టీఆర్ఎస్‌కు జంపైన మాగంటి గోపీనాథ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆసక్తికరమైన ఈ సంవాదంలో పార్టీలు మారే వారిని ఉద్దేశిం

తెలంగాణ అసెంబ్లీ రాబీల్లో తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి, టీడీపీ నుంచి టీఆర్ఎస్‌కు జంపైన మాగంటి గోపీనాథ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆసక్తికరమైన ఈ సంవాదంలో పార్టీలు మారే వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాగంటిని ఏకిపారేశారు. 
 
దీంతో రేవంత్ రెడ్డిని మాగంటి ప్రశ్నలతో సంధించారు. ఈ క్రమంలో ''ఎన్టీఆర్ గురించి నీకేం తెలుసు?'' అంటూ మాగంటి, రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దానికి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, తనకు ఎన్టీఆర్ గురించి ఏమీ తెలియదని, కనీసం ఆయనను దగ్గర్నుంచి చూడను కూడా చూడలేదని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యాలయంలో కొత్త ఛాంబర్‌కు వెళ్లేటప్పుడు ముందుగా పెద్దమ్మగుడికి వెళ్లి ఆ తర్వాత ఛాంబర్‌లో అడుగుపెట్టావు. అభిమానముంటే ఎన్టీఆర్ ఘాట్ నుంచి ఛాంబర్ లో అడుగుపెట్టేవాడివ'ని మాగంటి గోపీనాథ్ ఎత్తిపొడిచారు. 
 
దీనికి బదులుగా రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, 'నువ్వు పార్టీ ఫిరాయించినప్పుడు ఎన్టీఆర్ ఘాట్ నుంచే వెళ్లావా?' అని సెటైర్ వేశారు. దీనికి మాగంటి సమాధానమిస్తూ, ఇంటి నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చానని చెప్పారు.