ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (11:05 IST)

సైదాబాద్‌ చిన్నారి కేసు: రైలు పట్టాలపై నిందితుడు రాజు శవం

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌ సింగరేణి బస్తీకి చెందిన చిన్నారి అత్యాచారం, హత్యకేసులోని ప్రధాన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్‌వద్ద రాజు మృతదేహం లభ్యమైంది. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా రాజును పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు అధికార ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 
 
కాగా, చిన్నారిపై అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా హత్య చేసి తప్పించుకున్న విషయం తెల్సిందే. గత ఐదు రోజులుగా అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పైగా ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. 
 
అతన్ని పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడిన కఠినంగా శిక్షించాలని, ఎన్‌కౌంటర్, ఉరి తీయాలనే బహిరంగంగా డిమాండ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్ కేసర్ ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైంది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా అతడిని గుర్తించారు.