1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (14:57 IST)

సీపీ సజ్జనార్‌పై బదిలీ వేటు... నామామాత్రపు పోస్టుకు బదిలీ

హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్లలో ఒకటి సైబరాబాద్. ఈ కమిషనరేట్ కమిషనరుగా సజ్జనార్ ఉన్నారు. గత మూడేళ్లుగా ఆయన ఈ విధులను నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా, దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎకౌంటర్ తర్వాత సీపీ సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరుగా సజ్జనార్ ఎంతో గొప్ప పేరు సంపాదించారు. 
 
ఈ ఎన్‌కౌంటర్ తర్వాత ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆయన్నే సీపీగా కొనసాగించింది. ఇపుడు ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్టీసీ ఎండీగా నియమించింది. అదేసమయంలో సైబరాబాద్ కొత్త కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రను నియమించింది.