విజయశాంతిని శశికళ రమ్మంటున్నారా? రాములమ్మ కోసం రెడీ చేస్తున్నారట...
తమిళనాడు రాజకీయాలు రంగులరాట్నం తిరిగినట్లు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితి నెలకొని వుంది. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అదేపనిగా ముఖ్యమంత్రి పళని స్వామిని గద్దె దించేందుకు తన ప్రయత్నాలు తను చేసుకుంటూ పోతున్నారు. దీనిపై త
తమిళనాడు రాజకీయాలు రంగులరాట్నం తిరిగినట్లు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితి నెలకొని వుంది. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అదేపనిగా ముఖ్యమంత్రి పళని స్వామిని గద్దె దించేందుకు తన ప్రయత్నాలు తను చేసుకుంటూ పోతున్నారు. దీనిపై తమిళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంతవరకు తిప్పికొడుతున్నారో ఏమోగానీ తెలంగాణ బిడ్డ రాములమ్మ విజయశాంతి మాత్రం పన్నీర్ సెల్వంపై మండిపడుతున్నారు.
పన్నీర్ సెల్వం దుష్టశక్తులతో చేయి కలిపి ఎంతో ఉన్నతమైన శశికళకు ఎదురుతిరిగారంటూ వ్యాఖ్యానించారు. శశికళ చాలా మంచివారనీ, ఆమె ముఖ్యమంత్రి కావాలని తను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న శశికళ వర్గం విజయశాంతిని ఆకాశానికెత్తేస్తున్నారట.
అంతేకాదు... ఆమెకు ఎలాగూ రాజకీయ అనుభవం వున్నది కనుక ఆమెకు ఏదయినా మంత్రి పదవి ఇస్తే బావుంటుందనే చర్చ నడుస్తోంది. శశికళ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వారు వేచి చూస్తున్నారట. ఇదిలావుంటే వచ్చే నెలలో శశికళను విజయశాంతి కలవాలనుకుంటున్నారట. మరి ఈ కలయికతో ఆమె ఏం చెప్పదలుచుకున్నారో?