మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

బీఆర్ఎస్సే కాంగ్రెస్.. కాంగ్రెస్సే బీఆర్ఎస్ : మాజీ మంత్రి టి.రాజయ్య

Tatikonda Rajaiah
తెలంగాణ రాష్ట్రంలోని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం, శివునిపల్లిలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి భారాసలో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినట్లు ఆయన గుర్తు చేశారు. 
 
తన వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం గురించి వివరించిన రాజయ్య.. భారాస ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి ఏది అడిగినా ఇస్తున్న దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు. 'అభివృద్ధి అంటే బీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌ అంటే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ అంటే బీఆర్‌ఎస్‌ అని' అన్నారు. 
 
బీఆర్‌ఎస్‌ అంటేనే కేసీఆర్‌ అని ఆవేశపూరితంగా ప్రసంగించారు. కడియం శ్రీహరి పని ఒత్తిడితో ఆత్మీయ సమావేశానికి రాలేకపోయారని రాజయ్య వివరణ ఇచ్చారు. కొంతమంది తాను పిలువకపోవడంతో రాలేదని అనుకుంటున్నారు. అది సరైంది కాదన్నారు.