1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (11:08 IST)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : నేడు మరోమారు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత

Kalvakuntla kavita
ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన ఎమ్మెల్సీ కె.కవిత గురువారం మరోమారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. 
 
గురువారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లి అధికారుల ఎదుట హాజరవుతారు. 
 
ఈ నెల 11వ తేదీన కవిత వద్ద సుమారు 8 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు... ఈ నెల 16న మరోసారి రావాలని అదేరోజు సమన్లు జారీచేశారు. అయితే, ఆ సమన్లను రద్దు చేయాలని కోరుతూ కవిత.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం ఆమె తరపున దాఖలైన పిటిషన్‌ను తక్షణం విచారణ జరిపేందుకు కోర్టు నిరాకరించింది. 
 
 
 
ఈ నెల 24వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం.. ఈ నెల 16న విచారణకు హాజరు కావడంపై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. పైగా, ఇదే అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కవిత గురువారం మరోసారి ఆమె ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.