సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (21:45 IST)

వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలు తక్కువ : ఎమ్మెల్సీ కె.కవిత

kkavitha
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత జోస్యం చెప్పారు. చెన్నైలో ఓ ఆంగ్లపత్రిక నిర్వహించిన ఓ సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందన్నారు. భారతదేశం పేరు అంతర్జాతీయ స్థాయిలో మనకబారేందుకు కారణమైన బీజేపీకి 2024 ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవని అభిప్రాయపడ్డారు.
 
'2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు' అనే అంశం ఈ చర్చ జరిగింది. ఇందులో కవిత పాల్గొన్నారు. పారదర్శకత, నిబద్ధతతో పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ, రెండు సార్లు అధికారంలో ఉండి చెప్పిన వాటిని పాటించలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె నొక్కివక్కాణించారు. 
 
గత పదేళ్లలో ప్రధానిగా నరేంద్ర మోడీ ఏం చేశారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారి దేశవ్యాప్తంగా భావసారుప్యత ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఐక్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలు తాగునీరు ఇస్తున్నామని చెప్పిన మోడీ, రాజ్యసభలో మాత్రం 11 కోట్ల కుటుంబాలకు ఇస్తున్నామని అసత్యాలు చెప్పారన్నారు. పార్లమెంట్‌లో గంటన్నర సేపు మాట్లాడిన ప్రధాని అదానీ స్కామ్‌ను ఎందుకు ప్రస్తావించలేదని ఆమె ప్రశ్నించారు.