ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (12:36 IST)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఎమ్మెల్సీ కవిత చార్టెడ్ అకౌంటెంట్ అరెస్టు

arrest
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె.కవిత వ్యక్తిగత మాజీ చార్టెడ్ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేశారు. 
 
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఆయన పాత్ర ఉన్నట్టు వచ్చిన అభియోగాల నేపథ్యంలో సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈయన హైదరాబాద్‌కు చెందిన పలు కంపెనీలకు లబ్ది చేకూరేలా వ్యవహరించారన్నది ఆరోపణగా ఉంది.
 
కాగా, ఆయన అరెస్టుకు ముందు గత రాత్రి ఢిల్లీలో బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ అధికారులు బుధవారం ఉదయం ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఆయనకు వైద్య పరీక్షల తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.