సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (10:53 IST)

చర్చికి వెళ్లే అమ్మాయిలే టార్గెట్.. ఫాస్టర్ రాసలీలలు వీడియో వైరల్

కన్యాకుమారిలోని ఓ యువ ఫాస్టర్ చర్చికి వెళ్లే అమ్మాయిలను ప్రలోభపెట్టి, వారిని లొంగదీసుకుని లైంగికంగా వాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కన్యాకుమారిలోని ఓ చర్చిలో 27 ఏళ్ల యువ పూజారి పని చేస్తున్నాడు. తాజాగా ఈ పూజారి సమక్షంలో ఓ మహిళ పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత, పూజారి తాను వివాహం చేసుకున్న మహిళతో సన్నిహితంగా వున్న వీడియోలు తీవ్ర షాక్‌కు గురి చేశాయి. 
 
సోషల్ మీడియాలో వీడియో విడుదలై వివాదం రేపడంతో పూజారి తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. అలాగే, ఒక నర్సింగ్ విద్యార్థిని, మరొక మహిళ పూజారిపై పోలీస్ స్టేషన్లలో లైంగిక ఫిర్యాదు చేశారు. చర్చికి వచ్చిన యువతుల నెంబర్లు అడిగి వారిపై పూజారి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ ఫిర్యాదులో వుంది. దీంతో పూజారి కోసం పోలీసులు వెతుకుతుండగా.. అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.