బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 28 మార్చి 2021 (19:14 IST)

ఖమ్మంలో నిషేధిత గుట్కా పట్టుకున్న టాస్క్ ఫోర్స్

ఖమ్మం టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా అవుతున్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో సిఐ వెంకటస్వామి, రవికుమార్ ఈరోజు స్థానిక పోలీసులతో కలసి ఖానపూర్ హావేలి పోలీసు స్టేషన్ పరిధిలోని బాలపేట గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహించారు.
 
అనుమానాస్పదంగా కనిపించిన TS13EK8392, AP09BW8809, TS08UB4462 మూడు కార్లను తనిఖీ చేయాగా నిషేధిత పొగాకు, గుట్కా ఉత్పత్తుల 17 సంచులు గుర్తించారు. దాంతో వారిని అరెస్టు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
 
వీటి విలువ సుమారు రూ. 6,80,000 /- వుంటుందని టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు.
 
బల్లెపల్లికి చెందిన అన్వర్, పాండురంగపురం కు చెందిన ఎస్ కె అంజాద్, హైదరాబాద్ కు చెందిన ఎస్ కె అఫ్జల్, అలీ లను అదుపులోకి తీసుకొన్నారు.
 
ఆన్వర్ ,అఫ్జల్, అలీ బీదార్ నుండి గుట్కాను తీసుకువచ్చి మరో రెండు కార్లకు బదిలీ చేసి ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విక్రయించడానికి తీసుకువస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడించారు.
 
చట్టపరమైన చర్యల నిమిత్తం స్వాధీనం చేసుకున్న గుట్కా, నిందుతులను ఖమ్మం ఆర్బన్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు.
 
తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐలు సతీష్ కుమార్ ప్రసాద్, పిసిలు రవి, రామకృష్ణ, కోటేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, హమీద్, సూర్యారాయణ, కళిరారెడ్డి, రామారావు పాల్గొన్నారు.