సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By JSK
Last Modified: గురువారం, 24 నవంబరు 2016 (21:29 IST)

ఘ‌నంగా కేసీఆర్ నూత‌న గృహ ప్రవేశం... చంద్ర‌బాబు క‌ంటే ముందే (వీడియో)

హైద‌రాబాద్ : ఏపీలో చంద్ర‌బాబు కొత్త స‌చివాల‌యంలోకి మార‌క ముందే, ఇక్క‌డ హైద‌రాబాదులో సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసంలోకి కుడికాలు ముందు పెట్టి అడుగు పెట్టారు. గురువారం ఉదయం సీఎం గృహ ప్రవేశం చేశారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి ‘ప్

హైద‌రాబాద్ : ఏపీలో చంద్ర‌బాబు కొత్త స‌చివాల‌యంలోకి మార‌క ముందే, ఇక్క‌డ హైద‌రాబాదులో సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసంలోకి కుడికాలు ముందు పెట్టి అడుగు పెట్టారు. గురువారం ఉదయం సీఎం గృహ ప్రవేశం చేశారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి ‘ప్రగతి భవన్‌’గా నామకరణం చేశారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో చినజీయర్‌స్వామి పాల్గొన్నారు. 
 
ప్రగతి భవన్‌లో సీఎం నివాసం, సమావేశం మందిరం, క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. సమావేశ మందిరానికి ‘జనహిత’గా నామకరణం చేశారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే ఈ నూతన భవన సముదాయాలను నిర్మించారు. ఇక కొత్త ఇంట్లో తెలంగాణా సీఎం కేసీఆర్ నివాసం ఉండ‌బోతున్నారు. చూడండి వీడియో...