జార్ఖండ్ పర్యటనకు వెళుతున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ శుక్రవారం జార్ఖండ్ రాష్ట్ర పర్యటనకు వెళుతున్నారు. సీఎం కేసీఆర్ రాంచీ పర్యటనకు అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి అక్కడ అమర వీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నారు.
కాగా, చైనా సరిహద్దుల్లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. వీరిలో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు ఒకరు ఉన్నారు.
ఆ సమయంలో సీఎం కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే, 2020 జూన్ 19 మంది సైనికులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ ఆర్థిక సాయం అందించేందుకు సీఎం కేసీఆర్ జార్ఖండ్ వెళుతున్నారు.