గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (11:07 IST)

తెలంగాణా కొత్త గృహ నిర్మాణ పథకం

ఏప్రిల్ నుంచి ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఇచ్చే పథకం అమలు కానుందని తెలంగాణ సర్కారు తెలిపింది. సొంత స్థలం ఉండి.. ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని గత ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్‌ పార్టీ హామీ ఇచ్చింది. 
 
వచ్చే బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేయనుంది. ప్రత్యేక బడ్జెట్‌ దీనికోసం పెట్టి.. ఏప్రిల్‌ నుంచే ఈ స్కీ ను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ పథకంతో సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఏప్రిల్ నుంచే కొత్త పింఛన్లు అమలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.