మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. సుఫారీ ఇచ్చి మరీ..?
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని వార్తలు వచ్చాయి. నలుగురు వ్యక్తులు ఆయనను చంపేందుకు సుపారీ ఇచ్చి మరి చంపించేందుకు ప్రయత్నించారు. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో తెలుగు ప్రజలు ఒక్కసారిగా షాకయ్యారు.
వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌లు ఫారుఖ్ అనే వ్యక్తితో మంత్రిని హత్య చేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 12 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫారుఖ్ పోలీసులకు సమాచారం అందించడంతో హత్య కుట్ర బయటపడింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కోణం చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లింకుతో ఈ కేసుకు సంబంధం వున్నట్లు సమాచారం.
గత సమయంలో శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్‌లో అక్రమాలు వున్నాయంటూ మహబూబ్ నగర్‌కు చెందిన కొందరు నేతలు ఫిర్యాదులు చేశారు.
ఆ ఫిర్యాదులు చేసిన వారిని కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం 12 కోట్లు సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారని చెబుతున్నారు.