శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (18:16 IST)

తెలంగాణా ప్రభుత్వం, యుకె ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఎంఓయు పునరుద్ధరణ

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖతో తమ అవగాహన ఒప్పందాన్ని యుకె ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యుకెఐబీసీ) పునరుద్ధరించింది. యుకెఐబీసీ మరియు తెలంగాణా ప్రభుత్వం నడుమ ఉన్న ఈ సహకార భాగస్వామ్యం బాగా స్థిరపడటంతో పాటుగా రెండు యుకె వ్యాపార ప్రతినిధిల బృందాలు రాష్ట్రాన్ని సందర్శించడంతో పాటుగా సుప్రసిద్ధ యుకె యూనివర్శిటీల ప్రతినిధులతో కూడిన బృందం రాకకూ దారితీసింది. ఈ చర్చలు  వ్యాపార వాతావరణాన్ని వేగవంతం చేయడంతో పాటుగా సులభతరమైన వ్యాపార నిర్వహణ అవకాశాలను సైతం వృద్ధి చేస్తాయి. దానితో పాటుగా యుకె- తెలంగాణా వ్యాపార భాగస్వామ్యాలకు దారితీస్తూనే, ఉన్నత విద్యలో భాగస్వామ్యాన్నీ విస్తరిస్తుంది.
 
ఈ ఎంఓయును వర్ట్యువల్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎంఓయును శ్రీ జయేష్‌ రంజన్‌, ముఖ్యకార్యదర్శి, పరిశ్రలు మరియు వాణిజ్య శాఖ, తెలంగాణా ప్రభుత్వం మరియు శ్రీ కెవిన్‌ మెక్‌కోల్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌– యుకెఐబీసీ లు శ్రీ ఆండ్రూ ఫ్లెమింగ్‌, డిప్యూటీ హై కమిషనర్‌, బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషన్‌– హైదరాబాద్‌ మరియు యుకె బిజినెసెస్‌ సమక్షంలో చేసుకున్నారు.
 
ఈ సందర్భంగా కెవిన్‌ మెక్‌కోల్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, యుకెఐబీసీ మాట్లాడుతూ ‘‘ తెలంగాణా ప్రభుత్వంతో కలిసి ఈ ఎంఓయుపై సంతకాలను చేయడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. మాకిప్పటికే ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని మరింత బలపేతం చేసుకునేందుకు ఇది దోహద పడుతుంది. రాష్ట్రంలో శక్తివంతమైన, ప్రభావం చూపగల రాజకీయ, బ్యూరోక్రాటిక్‌ నాయకత్వం ఉంది. యుకెఐబీసీ ఈ రాష్ట్రంతో అనుబంధం పెంచుకోవడానికి గల కారణాలలో ఇది కూడా ఒకటి.
 
ఈ కారణాల చేతనే ఎన్నో యుకె వ్యాపార సంస్థలు ఇక్కడకు రావడంతో పాటుగా రాష్ట్రంలో తమ పెట్టుబడులను విస్తరించాలనుకుంటున్నాయి. మా తరువాత డెలిగేషన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. అది ఆన్‌లైన్‌లో కాకుండా హైదారాబాద్‌లోనే జరుగాలని కోరుకుంటున్నాము. అంతేకాదు, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని  వ్యాపార ప్రతినిధి బృందంను యుకెకు స్వాగతించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు
 
ఈ వర్ట్యువల్‌ రౌండ్‌టేబుల్‌ ద్వారా, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తమ పాలసీలను మార్చుకుంటున్నదీ మరియు ప్రస్తుత వ్యాపార సంస్థలకు మద్దతునందించేందుకు బలీయమైన వ్యాపార వాతావరణం నిర్మిస్తున్నదీ , అలాగే కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం సృష్టిస్తున్న వేళ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు చేపట్టిన కార్యక్రమాలు గురించి యుకెఐబీసీ తెలుసుకుంది.
 
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ ‘‘ యుకె ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌తో ఈ ఒప్పందం పునరుద్ధరించుకోవడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. గత సంవత్సర కాలంగా ఉన్న ఎంఓయు ద్వారా పలు యుకె డెలిగేషన్స్‌ను రాష్ట్రంలో చూశాం. దీనిద్వారానే పలు వ్యాపార, ఉన్నత విద్య భాగస్వామ్యాలు జరిగాయి. యుకె మరియు ఇండియాలు వాణిజ్య మరియు పెట్టుబడుల పరంగా ఎన్నో సారుప్యతలను కలిగి ఉన్నాయి.
 
ఇటీవలి కాలంలోనే అవి మరింతగా వృద్ధి చెందాయి. మహమ్మారి నుంచి బయటకు వస్తున్న వేళ, తెలంగాణా యొక్క బహుళ పెట్టుబడి- ప్రమోషన్‌ పథకాలుతో పాటుగా వ్యాపార అనుకూల నియంత్రిత వాతావరణం మరియు మహమ్మారి సంబంధిత వ్యాపార కార్యకలాపాలకు పరిష్కారాలు వంటివి యుకె ఆధారిత వ్యాపారవేత్తలు మరియు కార్పోరేట్స్‌ను ఆకర్షిస్తున్నాయి. యుకెఐబీసీతో మా అనుబంధం పట్ల నమ్మకానికి ప్రతీక ఈ అవగాహన ఒప్పంద పునరుద్ధరణ మరియు రాష్ట్రంలో మరింతగా పెట్టుబడులు పెరిగేందుకు మరియు వృద్ధి సామర్థ్యం గరిష్టమయ్యేందుకు తోడ్పడుతుందని నమ్ముతున్నాము’’ అని అన్నారు
 
శ్రీ ఆండ్రూ ఫ్లెమింగ్‌, డిప్యూటీ హై కమిషనర్‌, బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషన్- హైదరాబాద్‌ మాట్లాడుతూ, ప్రస్తుత మహమ్మారి విసురుతున్న సవాళ్లకు ప్రతిస్పందనగా తమ ప్రభుత్వం వ్యాపారాలు మరియు జీవితాలు తిరిగి పునరుద్ధరింపజేసెందుకు కట్టుబడి ఉంది. ఈ లక్ష్యంను తెలంగాణాలోని తమ స్నేహితులు పంచుకున్నారు. ఈ ఎంఓయు పట్ల రెండు ప్రభుత్వాలూ ఆసక్తిగా ఉన్నాయి. ఈ ఒప్పందం ఫలితంగా వాణిజ్యం వృద్ధి చెందడంతో పాటుగా తెలంగాణా మరియు యుకెల నడుమ పెట్టుబడులు కూడా వృద్ధి చెందనున్నాయి. లండన్‌ నుంచి నేరుగా బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ సేవలు పునరుద్ధరిస్తున్నామని వెల్లడించిన వారంలోనే ఈ ఎంఓయు పునరుద్ధరించడం సమయానికి జరిగింది. అంతర్జాతీయ భాగస్వామ్య ఒక్కటే కోవిడ్-19కు ఉన్న ఒకే ఒక్క నివారణ’’ అని అన్నారు.
 
యుకె వ్యాపారాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం నడుమ చర్చలకు యుకెఐబీసీ తమ మద్దతును కొనసాగించనుంది. అంతేకాకుండా సులభతరమైన వ్యాపారం కోసం వ్యాపార సంస్థల నుంచి అందుకున్న ఫీడ్‌బ్యాక్‌ను నేరుగా అందించడంతో పాటుగా మార్కెట్‌ ప్రాప్యత, వ్యాపార విశ్వాసం మరింతగా వృద్ధి చేసే ఇతర సంబంధిత అంశాలు మరియు వ్యాపారం చేసుకునేందుకు నిర్వహణ వాతావరణం వృద్ధి చేయడం చేయనుంది. ఈ చర్చలు వార్షిక మంత్రిస్థాయి సమావేశాలు, పలు ప్రతినిధి బృందాల సందర్శన ద్వారా కొనసాగనుంది.
 
భవిష్యత్‌ పెట్టుబడి అవకాశాలను సైతం యుకెఐబీసీ కొనసాగించనుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటుగా కీలకమైన ప్రశ్నలకు సమాధానాలను అందించడం ద్వారా తమ సభ్యులకు మద్దతునందించడం, విభిన్న మార్కెట్‌లలో మదుపరుల చర్యలను సులభతరం చేస్తుంది.