మంగళవారం, 15 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (19:26 IST)

తెలంగాణ గవర్నర్ షాకింగ్ నిర్ణయం - 10 నుంచి ప్రజా దర్బార్

tamizhisai sounderrajan
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్ భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళా ప్రజా దర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. 
 
మహిళా దర్బార్ జూన్ 10వ తేదీ మధ్యాహ్నం 12 నుండి 1 గంటల వరకు జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇందులో మహిళలు పాల్గొనాలని, ఇందుకోసం మహిళలు 040-23310521కు ఫోన్ చేసి లేదా rajbhavan-hyd@gov.inకు మెయిల్ చేయాలని తెలిపారు.
 
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాజ్‌భవన్‌ ఉందని, ప్రతి నెలా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ గవర్నర్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న విషయం తెల్సిందే.