1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2022 (12:53 IST)

రాజ్‌భవన్‌‌లో ఉగాది వేడుకలు: సీఎం కేసీఆర్‌ సహా టీఆర్ఎస్‌ నేతలు దూరం

రాజ్‌భవన్‌‌లో ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్.. రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు.. సీఎం కేసీఆర్‌ సహా టీఆర్ఎస్‌ నేతలు దూరంగా ఉన్నారు. 
 
ఇక, వివిధ పార్టీలకు చెందిన నేతలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లు. పుదుద్చేరి మంత్రులు, స్పీకర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఆప్యాయంగా ఉండాలని.. కలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్దాం.. "నేను స్ట్రాంగ్ పర్సన్‌ని, నేను ఎవరికీ లొంగనన్నారు.." అంటూ వ్యాఖ్యానించారు గవర్నర్‌ తమిళిసై. ఇక, వచ్చేనెల నుండి రాజ్ భవన్‌లో ప్రజా దర్బార్‌ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
 
గవర్నర్‌ హోదాలో నా పరిమితులు నాకు తెలుసు.. నన్ను ఎవరూ నియంత్రించలేరు.. నాకు ఎలాంటి ఇగో లేదన్నారు తమిళిసై. మరోవైపు.. నా ఆహ్వానాన్ని గౌరవించి ఉగాది వేడుకలకు హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు గవర్నర్‌ తమిళిసై.